దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ లను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ పిలుపునిచ్చారు.
ఈరోజు హనుమకొండ జె ఎన్ ఎస్ గ్రౌండ్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన భగత్‌సింగ్ 91 వ వర్ధంతి కార్యక్రమానికి అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
నాడు దేశానికి స్వాతంత్రం రావాలి బ్రిటిష్ వాళ్ళను దేశం నుంచి వెళ్ళగొట్టాలి అనే లక్ష్యంతో పని చేసి ప్రజలందరినీ యువతను ఒక తాటి మీదికి తీసుకువచ్చిన గొప్ప వీరుడు భగత్ సింగ్ అని, స్వాతంత్రమే లక్ష్యమని ఎంచుకున్న మార్గం వైపు నడిచారని, ఎంతోమంది త్యాగధనులు దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని వారి స్ఫూర్తిని కొనియాడారు, నేటి యువత లక్ష్యం వైపు సాగాలని భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 9 వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి, ప్రజా సంఘ నాయకులు బండి పర్వతాలు, కృష్ణారెడ్డి,డివైఎఫ్ఐ నాయకులు రాజు, అనిల్, రఘు, సుధీర్, శ్రీకాంత్, శంకర్, కుమార్, సంపత్ లు పాల్గొన్నారు.
