భగత్ సింగ్ స్ఫూర్తి తో ఉపాధి కోసం ఉద్యమం- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి

దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే ప్రాణాలర్పించిన విప్లవ వీర కిశోరాలు భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్ స్ఫూర్తితో దేశంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ )హనుమకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి తెలిపారు.
ఈరోజు హనుమకొండ కుమార్ పల్లి లో భగత్ సింగ్ 91వ వర్ధంతి కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు.
భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ దేశం కోసం అతి చిన్న వయసులో ప్రాణాలు అర్పించి ఆనాటి దేశ యువతలో స్వతంత్ర కాంక్షను రగిలించిన భగత్ సింగ్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తమ పోరాటంతో గడగడ లాడించిన అని వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్య యువజన వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జేఏసీ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతి కుమార్, డివైఎఫ్ఐ నాయకులు యం. సుధీర్ డి. రాజు, కే. శ్రీకాంత్, బి. సురేష్ ,సంపత్, అనిల్, కుమార్ లు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.