భగవద్గీతను దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యనుండే ఒక పాఠ్యాంశంగా చేర్చాలని గీతా జయంతి

భగవద్గీతను దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యనుండే ఒక పాఠ్యాంశంగా చేర్చాలని గీతా జయంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసిన తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మరియు వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డా. సామల శశిధర్ రెడ్డి… గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీమద్ మహా భగవద్గీతను ప్రాథమిక స్థాయి నుండి విద్యార్థికి అందించాలని విద్యార్థి దశ నుండే ప్రతి వ్యక్తికి గీతను బోధించాల్సిన అవసరం ఉన్నదని కాబట్టి దేశవ్యాప్తంగా గీతా సారాంశాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లను డిమాండ్ చేస్తున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఎందుకనగా ప్రస్తుతం మనుషుల్లో మానవతా దృక్పథం లోపించి పోయినందున రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇంకా దిగజారిపోయే స్థితిలో ఉందని మానవతా విలువలు పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉన్నదని లేదంటే మానవ జాతి మనుగడకే పెను ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడినందున ఇప్పుడు గీత బోధన అవసరం అనివార్యం అయిందని వారు పేర్కొన్నారు. పుట్టిన ప్రతి వ్యక్తికి మంచి చెడుల పై అవగాహన కలగాలంటే ఎవరో ఒకరు బోధించాల్సిన అవసరం ఉంటుందని కావున శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన బోధనలను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో ఎటువంటి యుద్ధం జరిగినా అందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలని అందుకు కావలసిన నీతి నియమాలను అనుసరించాల్సిన బాధ్యత మనపై ఉందని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన విధానం చాలా గొప్పదని శత్రువుని తెలివితో చాకచక్యంగా ధైర్యంతో ఎదురునిలిచి సాహసంతో పోరాటం చేసి గెలుపొందే విధంగా ప్రేరేపించి విజయాన్ని సాధించే విధంగా శ్రీకృష్ణుడి బోధనలను వారు కొనియాడారు. అందువల్ల నేటి విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అవసరం కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గీతా సారాంశం ఒక పాఠ్యాంశంగా చేర్చాలని అందుకు తగిన విధంగా ఆలోచనలు చేయాలని వారు పేర్కొన్నారు. ఈరోజు గీతా జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.