భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చందర్లపాడు సెంటర్ నందు నిరసన కార్యక్రమం

చందర్లపాడు మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చందర్లపాడు సెంటర్ నందు నిరసన కార్యక్రమం* .

మంగళవారం భాజపా చేపట్టిన చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయడంతో పార్టీ నాయకులు ఇవాళ మరోసారి చలో రామతీర్థం చేపట్టారు.అందుకోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా నేతలంతా బయల్దేరగా….
పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో తోపులాట జరగడంతో రాష్ట్ర అధ్యక్షుడు సోము.వీర్రాజు,
ప్రధాన కార్యదర్శి
విష్ణువర్ధన్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారని
పోలీసుల వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం
వ్యక్తం చేసిన చందర్లపాడు మండల భాజపా నాయకులు…. ,
గుడిని సందర్శిస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
రౌడి రాజకీయం చేస్తూ భాజపా నాయకులను రామ తీర్థం వెళ్లనీయకుండా అక్రమంగా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
తక్షణమే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని,
హిందూ దేవాలయాలపై దాడులు చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, రాష్ట్ర భాజపా నాయకులను రామతీర్థం సందర్శనకు అనుమతించాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోసాని.గురునాథం
ప్రధాన కార్యదర్శి
గొటిక.శివకృష్ణారెడ్డి,
మండల జడ్పిటిసి అభ్యర్థి బోనం.రామిరెడ్డి,
నాయకులు
సాంబశివరావు, వెంకటప్పారెడ్డి మరియు కాండ్రపాడు గ్రామ భాజపా యువత పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.