భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన-రాపర్తి శ్రీనివాస్ గౌడ్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు 28వ 29 వార్డులో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రాపర్తి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 42 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా అవతరించడం ప్రతి కార్యకర్త గర్వించదగ్గ విషయమని అన్నారు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాలు అయిన అంత్యోదయ, ఏకాత్మతా మానవతావాదం స్ఫూర్తిగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, అనేక సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికే ముందు అందాలి అనే ఉద్దేశంతోనే యోజన చేస్తున్నారు అని అన్నారు. జనరిక్ మందుల షాపులు, వేప పూత పూసిన యూరియా, కిసాన్ సమ్మాన్ నిధి, ఈ శ్రమ కార్డులు, కిసాన్ క్రెడిట్ కార్డులు, ముద్ర బ్యాంకు రుణాలు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన, బేటి పడావో బేటీ బచావో, మాతృత్వ వందన ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు సమాజంలో ఉన్న చిట్టచివరి వ్యక్తికే ముందు అందాలి అనే ఉద్దేశ్యంతో ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో, దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా తలెత్తుకుని స్థితికి చేరుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయం అని అన్నారు….
ఈ కార్యక్రమంలో
28 వ వార్డ్ ఇంచార్జ్ రాపర్తి రాము గౌడ్, 29 వ వార్డు ఇంచార్జ్ ఆనంద్ గౌడ్ , పట్టణ నాయకులు రాపర్తి సంజయ్ గౌడ్, బొడ్డు నాగరాజు, సురేష్ ,ఎస్ పాల్ రెడ్డి, రాపర్తి మహేష్ గౌడ్ వెంకన్న, యాదగిరి ,తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.