భారత్ గ్యాస్ మొగుళ్లపల్లి ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలని సిపిఐ ML లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి. మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొగుళ్లపల్లి లోని భారత్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారులకు సరైన సమయానికి గ్యాస్ సిలిండర్ అందించడంలేదని బుకింగ్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ అందించకుండా వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారని, సిలిండర్ల కోసం వినియోగదారులు ఇంటిముందు గ్యాస్ బండి కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా డోర్ డెలివరీ ఛార్జి ఒక సిలిండర్ పై అదనంగా 50 నుండి 80 రూపాయల వరకు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, ఇకనైనా జిల్లా సివిల్ సప్లై అధికారులు స్పందించి వినియోగదారులకు సరైన విధంగా న్యాయం చేయని గ్యాస్ ఏజెన్సీ పై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.