భారత "రాజ్యాంగపఠనం" ప్రతి పౌరుడు ప్రతిజ్ఞ చేయాలి

సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం కొనసాగలేదని,సామాజిక ప్రజాస్వామ్యం అంటే ?స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాన్ని జీవన సూత్రాలు గుర్తించే పద్ధతి అని టి పి ఎస్ కే రాష్ట్ర నాయకులు జి.రాములు గారు అన్నారు ఉగాది సందర్భంగా టి పి ఎస్ కే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో “రాజ్యాంగ పఠనం ” మిన్న అనే కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం సోదరభావాన్ని దీనిలో ఏ ఒక్క దానిని వేరు చేసిన ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని అన్నారు 70 ఏళ్ల రాజ్యాంగానికి మనువాద పాలకుల దాడి ప్రారంభమైందని రాజ్యాంగ రక్షణ కోసం ప్రతి ఒక్క పౌరుడు పూనుకోవాలని “పంచాంగ శ్రవణం కన్నా రాజ్యాంగ పఠనం. మిన్న అంటూ తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చింది ప్రతి పౌరుడు
చేత ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.టిపిఎస్ కే రాష్ట్ర నాయకులు భూపతి వెంకటేశ్వర్లు భారత రాజ్యాంగం పిఠిక చదివి అందరిచే ప్రతిజ్ఞ చేయించారు.టిపిఎస్ కే రాష్ట్ర నాయకులు యం వి రమణ జి.నరేష్ గిరిజన సంఘం నాయకులు ధర్మ నాయక్ అనేక మంది యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.