మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానం చర్ల శివారు ఆనకట్ట తండాలో మంగళవారం తెల్లవారుజామున బానోత్ మమత (28) నీ భర్త గ్రామ ఉప సర్పంచ్ బానోత్ రవి అత్యంత కిరాతకంగా గొడ్డలి లో హత్య చేయడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండాకు చెందిన గ్రామ ఉప సర్పంచ్ బానోత్ రవి, మమత లకు గత ఆరు ఎండ్ల క్రితం వివాహం జరిగింది. భర్త రవి భార్యను నిత్యం అనుమానిస్తూ వేధించేవాడని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున మమతను గొడ్డలితో నరికి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బందువులు నిందితుడు రవి ఇంటిని తగులబెట్టి వస్తువులన్నీ ధ్వంసం చేయడంతో పాటు మృతదేహాన్ని తరలిస్తున్న క్రమంలో పోలీసులను అడ్డుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, న్యాయం చేయాలని కోరుతూ పోలీసులపై పరుష పద జాలంతో దూషించడంతో పాటు దాడికి యత్నించారు. ఒక్కసారిగా తండాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి డిఎస్పీ రఘు చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి డీఎస్పీ నేతృత్వం స్పెషల్ స్పోర్ట్స్ పోలీస్ లు లాఠీ చార్జీ చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీస్ లు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.