జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ రావు మండలం తాడిచర్ల లో మాచర్ల రాజయ్య (50) కు తన భార్య రాజమ్మ కు గడిచిన కొంత కాలం గా తీవ్ర గొడవలతో విడివిడిగా జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మళ్ళీ ఇద్దరి మధ్య గొడవ ముదిరి ఆదివారం ఉదయం భార్య రాజమ్మ భర్త కళ్ల లో కారం పొడి చల్లి రోకలి బండ తో కొట్టడం తో మాచర్ల రాజయ్య అక్కడికి అక్కడే చనిపోయారు. వెంటనే సంఘటన స్థలనికి చేరుకున్న కొయ్యురు ఎస్ ఐ తనుగుల సత్యనారాయణ విచారణ చేస్తున్నారు. హత్యకుగల కారణాలు దర్యాప్తు లో తెలుతాయి అని ఎస్ ఐ తెలిపారు.