భార‌త ఆర్మీ క‌ర్న‌ల్ గుర్‌దేవ్ సింగ్ ఆయ‌న ఢిల్లీ స‌రిహద్దుకు ఆందోళ‌న చేసేందుకు వ‌చ్చారు

ఈయ‌న పేరు క‌ర్న‌ల్ గుర్‌దేవ్ సింగ్‌. ఈయ‌న 38 ఏళ్లు పాటు భార‌త ఆర్మీలో స‌రిహ‌ద్దుల్లో దేశం కోసం పోరాడారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 78 ఏళ్లు. ఆయ‌న ఉత్త‌రాఖండ్ లోని రుద్ర‌పూర్ నుంచి ఢిల్లీ స‌రిహద్దుకు ఆందోళ‌న చేసేందుకు వ‌చ్చారు. ఆయ‌న‌ కార్గిల్ వార్‌, ర‌క్ష‌క్ జె అండ్ కె వంటి ఆప‌రేష‌న్లో భాగ‌మైయ్యారు. ద‌ట్ట‌మైన మంచులో కూడా దేశం కోసం ప‌ని చేశారు. కాశ్మీర్ వ్యాలీ, లేక్‌దాక్‌, దుగాకిస్తాన్ వంటి ప్రాంతాల్లో ప‌ని చేశారు. దేశం కోసం భూట‌న్‌, చైనా, పాకిస్తాన్లో కూడా ప‌ని చేశారు. ఆయ‌న‌తో మాట్లాడిన‌ప్పుడు ఆయ‌న చిన్న లాజిక్ నాకు, నాతో వ‌చ్చిన మ‌రో జ‌ర్న‌లిస్టుకి చెప్పారు. అయితే ఆ లాజిక్ నాకు ముందే తెలుసు. అదేమిటంటే..ధ‌ర నిర్ణ‌యానికి సంబంధించి. దేశంలోని నీరు స‌హ‌జవ‌న‌రు. దాన్ని తీసుకుని మ‌న‌కు అమ్ముతున్నారు. ఒక రూపాయి నీరు, మ‌రో రూపాయి ప్రాసిసెంగ్‌కు అవుతుంది. అంటే మొత్తం రెండు రూపాయాలు అవుతాయి. కాని ఆ వాట‌ర్ బాటిల్ ధ‌ర రూ.20ల‌కు అమ్ముతున్నారు. దాని ధ‌ర ఎవ‌రు నిర్ణ‌యిస్తున్నారు..? క‌ంపెనీ నిర్ణ‌యిస్తుంది. అదే రైతు పండించిన పంట గురించి చెబుతాను. రైతు దున్ని, భూమిని పంట‌కు త‌యారు చేస్తాడు. పంట వేస్తాడు. దానికి ఎరువులు, మందులు వాడుతాడు ఈ క్ర‌మంలో చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్ర‌కృత వైప‌రీత్యాల నుంచి పంట‌ను కాపాడేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. త‌న శ్ర‌మ‌నంత‌టిని పంట‌పైనే పెడ‌తాడు. రాత్రి ప‌గ‌లు, వ‌ర్షం, ఎండ వంటి వాటిని లెక్క చేయ‌కుండా ప‌ని చేస్తాడు. అప్పులు చేసి త‌న కుటుంబం మొత్తం భూమిపైనే ప‌ని చేసి పంట పండిస్తే, దాని ధ‌ర నిర్ణ‌యించే అధికారం రైతుకు లేదు. మ‌ళ్లీ వ్యాపార‌స్తులే ధ‌ర నిర్ణ‌యిస్తారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చే క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కూడా స‌రిగా ఉండ‌దు. దానికంటే త‌క్కువ‌కే వ్యాపార‌స్తులు కొనుగోలు చేస్తారు. బ‌హుల జాతి సంస్థ‌లు కూడా ఎంఎస్‌పికి త‌క్కువే కొనుగోలు చేస్తాయి. ఇంకెక్క‌డుంది న్యాయం. ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం తెచ్చే నూత‌న చ‌ట్టాలు అంతంత మాత్రంగా ఉన్న మా జీవ‌నోపాధికి, దేశ ఆహార భ‌ద్ర‌త‌కు న‌ష్టం చేకూర్చుతుంది. మోడీ ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సింది పోయి, కొత్త స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెట్టారు అని ఆ జవాన్ పేర్కొన్నారు. నావీ, ఎయిర్ ఫోర్స్‌, ఆర్మీల్లో ఉన్న 90 శాతం ఉద్యోగులు, జ‌వాన్లు రైతుల కొడుకులే. దేశాన్న ర‌క్షించ‌డంలో సైనికులు ఎంత కీల‌క‌మో…దేశం జీవించ‌డానికి రైతులు అంతే కీల‌కం. అందుకే జై కిసాన్‌…జై జ‌వాన్ అనే చారిత్ర‌క నినాదం మ‌న‌కుంది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.