ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామంలో ఇటీవల గ్యాస్ లీకేజీ ఘటనలో ఇల్లు కాలిపోయి నిరాశ్రయులైన కోట నాగేష్, కిషోర్,పుల్లయ్య గార్ల కుటుంబాలను ఎర్రుపాలెం మండలం రాజుపాలెం ఎంపిటిసి,తెలంగాణా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు అయిన శ్రీ దోమందుల సామేలు గారు తన కుటుంబ సభ్యుల తో కలసి బాధితులను పరామరసించడం జరిగింది. వీరికి బియ్యం మరియు నిత్యావసర సరుకులు,బట్టలు అందజేశారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం బాధితులకు వెంటనే ఆదుకోవాలని వీరికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చెయ్యాలని మండల టిడిపి పార్టీ తరుపున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.