#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69 news జఫర్ ఘడ్ మార్చి26
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి (జి)ఓబులాపూర్ రెవెన్యూ గ్రామాల భూమి నిర్వాసితులు తమ్మడపల్లి జి గ్రామంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పుగల్లు రిజర్వాయర్ నుండి తమ్మడపల్లి(జి)ఓబులాపురం గ్రామాల వ్యవసాయ భూమి మీదుగా పాలకుర్తి రిజర్వాయర్ లోకి కాలువ వెళ్ళుతున్నదని,అందుకు అధిక శాతం మంది రైతులు అధిక మొత్తంలో(ఎకరాల్లో) భూమి కోల్పోవలసి వస్తుందని,దానికి నష్టపరిహారంగా బహిరంగ మార్కెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటీసి సభ్యులు చిలువేరు శివయ్య,గుండెబోయిన రాజు,వేల్పుల రవి, వేల్పుల యాదగిరి,వడ్లకొండ రాజు,దాసరి ఎల్లయ్య,నాసర్, మందపూరి రాజు,సుదగాని యాదగిరి,రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.