పామిడి సమాచారం…పట్టణంలో వెలసిన శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయం హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్, ఈఓ రామతులసి, ఈఓ అక్కిరెడ్డి, అర్చకులు సోమశంకర్ స్వామి, రామేశ్వర శర్మ శుక్రవారం ఆలయ కమిటీ, భక్తుల సమక్షంలో లెక్కించారు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది స్వామివారి హుండీ ఆదాయం స్వల్పంగా తగ్గిందని ఇందుకు ప్రధాన కారణం 4 నెలలు పాటు కరోనాతో ఆలయం మూసివేయడం కావచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది స్వామివారి హుండీ ఆదాయం రూ. 1,64,294 లు రాగా గత ఏడాది రూ. 1,71,877లు వచ్చింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు