మండలంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అక్రమ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు భూక్య చందు నాయక్ తీవ్రంగా విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
*వరంగల్ హన్మకొండ జిల్లా లలో గుడిసెలు వేసుకున్న పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి వ్యక్తిగత డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వాలని CPM హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగు మహా ధర్నా కు ముఖ్య అతిథిగా వస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పోతినేని సుదర్శన్ గార్లను అక్రమ అరెస్ట్ చేసి నిర్భందించిన రాయపర్తి పోలీసులు అనంతరం జనగామ జిల్లాలోని పాలకుర్తి మండల పోలీస్ స్టేషన్ కు తరలించడం ప్రభుత్వ పిరికిపంద చర్యలకు నిదర్శనమని జిల్లాలో, రాష్ట్రంలో ఎటువంటి జనసామికరణ పోరాటాలు లేకున్నా జిల్లాలోని 12మండలంలో సిపిఎం పార్టీ నాయకత్వం, శ్రేణులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు అయిన వారిలో సిపిఎం మండల నాయకులు పాండ్యల అంజయ్య, పెద్ద అంజయ్య,కనకయ్య,గుంటి సంపత్ తదితరులు ఉన్నారు.
