రేగొండ మండల కేంద్రంలో తెరాస రేగొండ టౌన్ ఆధ్యక్షులు కోలేపాక బిక్షపతి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నిరంకుశ విధానాలకు నిరసనగా యాసంగిలో పండించిన వరి దాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ రైతాంగం పట్ల ఎలాంటి వివక్ష లేకుండా కొనుగోలు చేయాలని మరియు పెరిగిన డీజిల్, పెట్రోల్,వంట గ్యాస్ ధరలను తగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,తెరాస పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షులు కేటీఆర్,భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, రైతు పక్షపాతి,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి,వరంగల్ రూరల్ జడ్పీఛైర్పర్సన్, జయశంకర్ భూపాలపల్లి తెరాస అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి ఆదేశాల మేరకు రేగొండ మండల కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి రేగొండ ఎంపిటిసి మైసా బిక్షపతి సుమలత సీనియర్ నాయకులు లు పున్నం రవి మాజీ ఎంపిటిసి పటాన్ శంకర్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ మారగాని నరేష్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మేకల రాజు యువజన నాయకులు వారణాసి అజయ్ తడక శ్రీకాంత్ ఎస్సీ సెల్ టౌన్ అధ్యక్షులు గజ్జల రామకృష్ణ టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు మైస వీర్రాజు దుమ్మేటి ఫోసాలు మేకల తిరుపతి పులి కిషన్ గుంటజు కిషన్ మైస సృజన మైస జిలేబి సోషల్ మీడియా మండల ఇంఛార్జి రేగొండ ఎడ్ల గణేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
