మండల పార్టీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం

(18/02/2021) ఈరోజు దేవరుప్పుల మండలంలోని సింగరాజుపల్లి గ్రామంలో దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ పార్టీ అధ్యక్షులు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులతో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ గారి గెలుపు కోసం మండల పార్టీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జనగామ జిల్లా అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవరెడ్డి గారు మాట్లాడుతూ గిరిజన ముద్దు బిడ్డ రాములునాయక్ గారిని గెలిపించాలని గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీకి మరియు బిజెపి పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ ఒక్క హామీలు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి గారు విద్యార్ధుల ను మోసం చేసి తమ సొంత కాలేజీలను యూనివర్శిటీలుగా మార్చుకోవడం కోసం డబ్బులు వసూలు చేసి కెసిఆర్ గారికి అప్పజెప్పడం తప్ప విద్యార్ధులను పట్టించుకున్న దాఖలాలు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు.
టీఆర్ఎస్ పార్టీ డబ్బు మదంతో పోలీసు బృందంతో న్యాయం కోసం పోరాడే న్యాయవాదులకు కూడా రక్షణ లేని పరిస్థితి ఉందంటే ఈ కేసీఆర్ ప్రభుత్వమే.
ఇలాంటి నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చింది విద్యార్థులను చదువుకోడానికి కాలేజీలు కట్టించింది ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చింది రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కావున ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రాములు నాయక్ గారి చేతి గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
అదేవిధంగా గ్రామాలవారీగా గ్రామ కమిటీలు మండల కమిటీలు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కమిటీలు వేసీ అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికలలో గెలిపించే దిశగా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మండల పార్టీ అధ్యక్షులు ఉప్పల సురేష్ అయ్యగారు కిసాన్ సెల్ అధ్యక్షులు సోమిరెడ్డిగారూ గ్రామ పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డిగారు కోళ్ల ప్రదీప్ గారు అంజయ్య గారు గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.