చిట్యాల మండల కేంద్రంలోనీ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున నిర్వహించిన మండల సర్వ సభ్య సమావేశంలో భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి హాజరైనారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సభవేదిక ద్వారా గ్రామ సర్పంచ్ లు,ఎంపీటీసీలు లేవనెత్తిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా,ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, అధికార దుర్వినియోగం చేస్తున్న మండల ఎలక్ట్రిసిటీ ఇంచార్జీ ఏఈ పై చర్యలు తీసుకోవాలని ఎన్పిడిసిఎల్ చైర్మన్, ఎస్ ఈ లకు తెలియచేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి, జడ్పీటీసీ గొర్రె సాగర్, ఎంపిడిఓ రామయ్య మరియు ఎంపీటీసీలు,గ్రామ సర్పంచ్ లు,మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
