జనవరి 4 న వరంగల్ నగరానికి రాబోతున్న మంత్రి కె టి ఆర్ గారిని అడ్డుకుంటాం

కాంగ్రెస్ భవన్ – 30-12-2020…

…నాయిని..

కాంగ్రెస్ శ్రేణులకు వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గారు వరంగల్ నగరం లో వివిధ పర్యటనలు, ఎన్నికలు సందర్భంగా వరంగల్ ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ఏమయ్యాయి, హైదరాబాద్ లాగా వరంగల్ లో వరదలకి నష్టపోయిన కుటుంబాలకి ఇంటికి 10000/- రూపాయలు ఎందుకు ఇవ్వలేదు,

హామీలు ఎందుకు నెరవేర్చలేదని వివరణ ఇవ్వాలి, వరంగల్ ప్రజలకు మంత్రి క్షమాపణ చెప్పాలి.

ముంబైకి పుణె, బెంగుళూర్ కి మైసూర్ లాగా హైదరాబాద్ తో సమానంగా వరంగల్ నీ అభివృద్ధి చేస్తామన్నారు ఏమయింది వివరణ ఇవ్వాలి

వరంగల్ నగరాభివృద్ధి కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు నిధులిచ్చారో తెలియపర్చాలి

నిధులు ఇవ్వకుండా హామీలు అమలుచేయ కుండా వరంగల్ నగరాన్ని 20 ఎండ్లు వెనక్కి తీసుకెల్లారు

అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు ఏమయ్యాయి, అర్హులైన నిరుపేద కుటుంబాలకి ఇవ్వాల్సిన నిర్మాణం పూర్తయిన 545 డబుల్ బెడ్రూం లని వెంటనే అర్హులకు పంపిణీ చెయ్యాలని, అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసిన దళారుల సంగతెంటి ?

కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి 2015 జనవరి లో వరంగల్ కి వచ్చిన సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికీ నెరవేరలేదు, ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ వస్తున్నారని, ఇప్పటికే శంకుస్థాపనలు జరిగిన పనులు, నిర్మాణం పూర్తయిన పనులు ప్రారంభం కాలేదని, కొత్తగా మళ్లీ శంకుస్థాపనలు పేరిట ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, వరంగల్ ప్రజలు చూస్తూ ఊరుకోరు తగిన గుణపాఠం తండ్రి కొడుకులకు చెబుతారని, వరంగల్ ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా, జనవరి 4 న వరంగల్ నగరానికి రాబోతున్న మంత్రి కె టి ఆర్ గారిని కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు అడ్డుకోవాలని నాయిని రాజేందర్ రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.