పాలకుర్తి:మంచుప్పుల గ్రామ దళితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి మోకు కనకా రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి దళితుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగామోకు కనకా రెడ్డి మాట్లాడుతూ మంచుప్పుల గ్రామంలో 1993సంవత్సరంలో 52 దళిత కుటుంబాలకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది అట్టి ఇళ్ల స్థలాల పట్టాలనుమరియు భూమిని గత అనేక సంవత్సరాలుగా దళితులు కాపాడుకుంటున్నారు ఈ క్రమంలో ధరణి వెబ్సైట్ లో వచ్చిన సాంకేతిక కారణాలను ఆసరా చేసుకొని అట్టి భూమిని అక్రమంగా గా పట్టా చేయించుకుని దళితులకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చింది ఈ సందర్భంగా మా ఇళ్ళ స్థలాలు మాకు ఉండాలని దళితులు గత 70 రోజుల నుండి వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలో గురువారం రోజున మంత్రి దయాకర్ రావు గారిని హన్మకొండలోని గెస్ట్ హౌస్ లో సిపిఎం జిల్లా ప్రతినిధి బృందం మరియు దళితులు కలిసి ఇట్టి సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మంత్రిగారు సానుకూలంగా స్పందించి ఇట్టి సమస్యను త్వరలో పరిష్కారం చేసి దళితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు. బొట్ల శేఖర్. సింగారపు రమేష్. జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న. ఏరియా కమిటీ నాయకులు మాచర్ల సారయ్య. భూ పోరాట కమిటీ నాయకులు కాకర్ల రమేష్. బాణాల వెంకన్న. గోగుల యాదగిరి. కాకర్ల పద్మ. కాకర్ల యకమ్మ. ప్రశాంత్. కాకర్ల సోమయ్య. బాణాల సోమయ్య. దండం పల్లి సోమన్న. పడమటింటి చంద్రయ్య. కాకర్ల బాబు. కొత్తూరు రాములు. మోత్కుపల్లి సుజాత. బాణాల రేణుక. బాణాల మైసమ్మ. తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.