మంత్రి మెప్పు కోసం దళితుల ఇబ్బందులు పెడుతున్న పాలకుర్తి ఎస్ ఐ

మంత్రి మెప్పు కోసం దళితుల ఇబ్బందులు పెడుతున్న పాలకుర్తి ఎస్ ఐ
భూసమస్య పరిష్కారం కోసం మంత్రి చొరవ చూపాలి
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు

జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచుప్పుల దళితులను పాలకుర్తి ఎస్ ఐ వంశీ కృష్ణ మంత్రి ఎర్రబెల్లి మెప్పుకోసం దళితులను నానా ఇబ్బందులు పెడుతున్నారని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు అన్నారు
గురువారం పాలకుర్తి లో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించిన దళితులను కలిసి ఆయన ఓదార్చారు. పాలకుర్తి ఎస్ ఐ వంశీ కృష్ణ ఓవర్ యాక్షన్ చేస్తూ దళితులను నానా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు ప్రగతి భవన్ ముట్టడి అనే తప్పుడు సమాచారంతో పాలకుర్తి ఎస్ ఐ ఓవర్ యాక్షన్ చేస్తూ దళితులను నానా ఇబ్బందులకు గురిచేశాడని విమర్శించారు. నిన్న ఉదయం11గంటలకు అకారణంగా 8మందిని అరెస్ట్ చేసి రాత్రంతా ఒక గదిలో నిర్బంధించారని వారి ఫోన్లు గుంజుకొని ఇబ్బoది పెట్టారని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రోద్బలంతో దళితులపై పోలీసులు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని చెప్పారు.
గత కొంతకాలంగా తమ కబ్జాలో ఉండబడిన అసైన్డ్ భూములలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టినప్పటికి తమకు ఇండ్లు ఇవ్వకపోవడం తో నిర్మాణం అయి ఉన్న ఇండ్లలో దళితులు నివాసం ఉంటున్నారని అధికారికంగా వారికి పట్టాలు ఇవ్వాలని శాంతియుతంగా నిరాహార దీక్షలు చేస్తున్న ఎనిమిది మంది దళితులను అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని చెప్పారు.పాలకుర్తి ఎంపిపి నాగిరెడ్డి పోలీసులతో వత్తిడి చేస్తూ భూసమస్యను నాన్చుతు ఇబ్బంది పెడుతున్నాడని విమర్శించారు మంత్రి తన నియోజకవర్గం లో దళితులు 100రోజులుగా దళితులు నానా ఇబ్బoదులు పడుతుంటే ఎందుకు సమస్య పరిష్కారం చేయడం లేదన్నారు మంత్రి చొరవ తీసుకొని భూసమస్య ను పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమములో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు తూటి దేవదానం, బొట్ల శేఖర్,సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మబ్బు ఉప్పలయ్య, నవసమాజ్ పార్టీ అధ్యక్షులు యాసారపు కరుణాకర్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు దడిగే సందీప్, భూపోరాట నాయకులు కాకర్ల రమేష్. బాణాల వెంకన్న. జి యాదగిరి. బాణాల రేణుక. దండ పెళ్లి యాకమ్మ. సోమక్క. వెంకటమ్మ. ప్రశాంత్. సైదులు. బాబు. సోమన్న.తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.