#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

పదోరోజు కొనసాగుతున్న పరామర్శలు

రేపటి పెద్ద కర్మ కార్యక్రమానికి ముఖ్య నేతల రాకకోసం ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తదితరులు

రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి తండ్రి లింగ్యా నాయక్(85) గారు తొమ్మిది రోజుల క్రితం (17.02.2022) హఠాన్మరణం చెందడంతో పదో రోజు పరామర్శలు కొనసాగుతున్నాయి. మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, బంధువులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అధికారులు తదితరులు మంత్రిని, మంత్రి సోదరులు కిషన్ నాయక్ గారిని పరామర్శించి, స్వర్గీయ లింగ్యా నాయక్ గారి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు.

రేపు స్వర్గియ లింగ్యా నాయక్ గారి పెద్ద కర్మ పురస్కరించుకుని రాష్ట్ర మంత్రులు, ముఖ్య నేతలు, ప్రముఖులు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు, అధికారులు, బందువులు రానున్న నేపథ్యంలో నేడు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు ఎంపి మహబూబాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, కురవి జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీమతి వనజా శ్రీరామ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పెద్ది సైదులు మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారితో కలిసి ఏర్పాట్లను సమీక్ష చేశారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, ఖమ్మం కలెక్టర్ వి.పి గౌతమ్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, కురవి జెడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీమతి వనజా శ్రీరామ్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, మహబూబాబాద్ డి.ఆర్.డి.ఓ – పి.డి సన్యాసయ్యలు నివాళులు అర్పించారు.

మంత్రితో పాటు టి.ఆర్.ఎస్ నేతలు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మూల మధుకర్ రెడ్డి, నూకల శ్రీ రంగారెడ్డి, శ్రీరామ్ నాయక్, ప్యాట్ని సురేష్(మన్యు), శ్రీకాంత్ నాయక్, జగదీశ్ నాయక్, డాక్టర్ సుందర్ నాయక్, కొమ్మినేని రవీందర్, యార్ల మురళీధర్ రెడ్డి, అఫ్జల్, సర్పంచ్ బోడ శ్రీను, బిక్షం రెడ్డి ఇతర నేతలు ఉన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.