ఈ69న్యూస్ మహబూబాబాద్ జులై 30
రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాతృమూర్తి గుగులోత్ దస్మా గారి పార్టీవ దేహం వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్ప గుచ్ఛం ఉంచి శద్ధాంజలి ఘటించారు. మంత్రి సత్యవతిని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించి మాట్లాడి వారి తల్లి మరణానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. దిగ్భ్రాంతికి గురైన ఆమె ను ఓదార్చి,మనోధైర్యం ఇచ్చారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.