మతోన్మాదం, కార్పొరేట్ సంస్థల మైత్రే బీజేపీ లక్ష్యం

బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని రాజ్యాంగం మార్చే కుట్రలు జరుగుతున్నాయని ప్రజల ప్రాథమిక హక్కులను రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ అవసరాలకోసం మతోన్మాదాన్ని, కార్పొరేట్ సంస్థలకు మైత్రి పెంచి ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే బీజేపీ లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు md.అబ్బాస్ హెచ్చరించారు.

 జనగామ పట్టణ కేంద్రంలోని పూసల భవనంలో పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ. అబ్బాస్ ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ  జనగామ జిల్లాలో  సిపిఎం బలోపేతానికి కృషి చేస్తూ, దేశ వ్యాప్తంగా ప్రజలు నిత్యావసర సరకుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక సమస్యలతో సతమతమవుతున్నారని ప్రజాసమస్యలపై ఆందోళన, పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిందని రాజ్యాంగం మార్చే కుట్రలు జరుగుతున్నాయని ప్రజల ప్రాథమిక హక్కులను రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయని అలాగే ప్రయివేటు రంగం ముందుకు వస్తుందని, బీజేపీ దేశభక్తి దేశంలోని సంపద, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మడమేనని విమర్శించారు. దేశంలో హిందూ రాజ్యం పేరుతో లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తూన్నారని తెలిపారు. దేశ విదేశాంగవిధానం అమెరికాకు దాసోహంగా మారిందని విమర్శించారు. దేశంలో ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థను ముందుకు తేవాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. బీజేపీ విధానాలను ఎండగట్టుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మార్చి, ఏప్రిల్ నెలలలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మాస్ క్యాంపెన్ ఉంట్టుందని ఈ సంధర్బంగా వచ్చిన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఇర్రి అహల్య, రాపర్తి రాజు, గొల్లపల్లి బాపురెడ్డి, రాపర్తి సోమన్న, సిఐటియూ జిల్లా అధ్యక్షులు బోట్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు జోగు ప్రకాష్, బోడ నరేందర్, ఎం.డి అజారోద్దిన్,  బెల్లంకొండ వెంకటేష్, భూక్యా చందునాయక్, చిట్యాల సోమన్న, మునిగేల రమేష్, కోడెపాక యాకయ్య, ఎండి. షబానా, మండల కార్యదర్శులు గంగాపురం మహేందర్, బొడ్డు కరుణాకర్, ప్రజ్ఞాపురం నర్సింహులు, పట్టణ కమిటీ సభ్యులు, బిట్ల గణేష్, బాల్నే వెంకటమల్లయ్య, పందిళ్ల కల్యాణి, కళ్యాణం లింగం, బోట్ల శ్రావణ్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తూడి దేవదానం, ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దూసరి నాగరాజు, జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి సాదం రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి ధర్మభిక్షం, దడిగే సందీప్, కెజికెఎస్ జిల్లా అధ్యక్షులు కుర్రే ఉప్పలయ్య, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీరా సురేష్, రజక సంఘం జిల్లా కన్వినర్ సాంబరాజు దుర్గాప్రసాద్, మోకు భవాని, కొండ వరలక్ష్మి, బూడిది అంజమ్మ, గాడి సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.