మతోన్మాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించించుకోవడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ట్యాంక్ బండు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ మతోన్మాద శక్తులపై రాజీలేని పోరాటం చేసి మతోన్మాదుల నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు. దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల ప్రజలకు, మైనారిటీలు,మహిళలపట్ల మతోన్మాదం ప్రమాదకరంగా మారిందన్నారు. అన్ని తరగతుల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాళ్ళరాయడానికి సంఘ్ పరివారం కుట్రలు చేస్తోందని విమర్శించారు. మతం పేరుతో, కులం పేరుతో దాడులు పెరిగిపోయాయని, మహిళల పై అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఏ మనువాదానికి వ్యతిరేకంగా అంబేద్కర్ తన జీవితాంతం పోరాడాడో అదే మనువాదం నేడు రాజ్యాంగాన్ని కబళించాలని చూస్తున్నది. మనువాద, మతోన్మాద ప్రమాదం నుండి రాజ్యాంగాన్ని, దేశాన్ని రక్షించు కోవడమే దేశప్రజల ముందున్న ప్రధాన కర్తవ్యం. మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అవుతుందని
ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర నాయకులు అబ్దుల్ సత్తార్, ఇఫ్తేఖార్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.