#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

E69న్యూస్ రేగొండ :జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో యువతను వక్రమార్గాలలో పయనించేలా చేస్తున్న గంజాయి, మత్తు పదార్దాల నిర్ములన కోసం అందరు సహకరించాలని రేగొండ ఎస్సై N. శ్రీకాంత్ రెడ్డి అన్నారు, రేగొండ మండలంలోని జగ్గయ్యపేట, లింగాల గ్రామాలలో గంజాయి, గూట్కా వంటి మత్తు పదార్థాలపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ యువత గంజాయి, గూట్కా, గుడుంబ, పొగాకు వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ ఆరోగ్యలను, సంపదను కాపాడుకోవాలన్నారు. గంజాయి మొక్కల సాగు చట్టరీత్యా నేరమని, రైతులు గంజాయి సాగు చేయకూడదని తెలిపారు. గ్రామంలో ఎవరైనా గంజాయి సాగు చేస్తే వారికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అపివేస్తస్మాని ఇటీవల రాష్ట్రప్రభుత్వం సూచించిందాన్నారు, రేగొండ మండలంలో గంజాయి లాంటి మత్తు పదార్దాలు పండించిన, అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామ్మన్నారు. అలాంటి వారి సమాచారాన్ని తమకు (9440904679)ఫోన్ ద్వారా తెలియచేయాలన్నారు. గ్రామాలలో యువత గంజాయికి అలవాటు పడినట్టుగాని, గంజాయి సేవిస్తున్నట్టు గాని తెలిస్తే వారి వివరాలు తమకు తెలియచేస్తే వారికి కౌన్సెలింగ్ చేసి దురలావాటు నుండి బయటపడేలా మేము సహకరిస్తామని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట, లింగాల సర్పంచులు, గ్రామకార్యదర్శులు, గ్రామస్థులు, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.