మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థులు మరియు యువత మత్తు పదార్థాలకు స్వస్తి పలికి తమ భవిష్యత్తు కోసం కొత్త జీవితాన్ని ప్రారంభించాలని యువతకు పిలుపునిచ్చారు.

మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన 12 మంది విద్యార్థులను (ధర్మసాగర్-03, హన్మకొండ-09) మరియు గంజాయి అమ్ముతునటువంటి 5 మంది నీ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేయడం జరిగినది, విద్యార్థులను ఈ వ్యసనం నుండి విముక్తి కలిగించే విధంగా కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని అడిషనల్ డీసీపీ., టాస్క్ ఫోర్స్, టాస్క్ ఫోర్స్ కార్యాలయములో చేపట్టారు
.
మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన విద్యార్థులతో మరియు వారి తల్లి తండ్రులతో ఈ రోజు వారికి నూతన జీవితాన్ని అందించాలనే లక్ష్యంగా మరియు గంజాయి సేవించిన మరియు అమ్మిన దాని వల్ల కలిగే దుషపరిణామాలు ఆయన వివరించారు. అంతే కాకుండా గంజాయి సేవించిన వారందరూ విద్యార్థులు కావడంతొ వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకోకుండా, చివరి అవకాశం అని చెప్పారు.. కేవలం అమ్మెవారి పై కేసులు పెడతామని చెప్పారు. అరెస్ట్ చేయబడిన విద్యార్థులలో ఒక్కరూ తప్ప మిగితా వారందరూ ఈ మత్తు పదార్థాలకు కొత్తగా వ్యసనం అయినవారు కనుక కాలేజ్ యాజమాన్యాలకు మరియు వారి తల్లి తండ్రులు వీరి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సింది గా సూచించారు…

అదేవిధంగా పై విద్యార్థులంతా మత్తు పదార్థాల వ్యసనం నుండి విముక్తి కలిగేలా వరంగల్ పోలీస్ కమిషనర్ Dr.తరుణ్ జోషి గారు నయీ కిరణ్ అనే నామకరణంతో కార్యాక్రమాన్ని రూపొందించడం జరిగింది.
ఆ వివరాలను తెలియజేస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాలకు బానిసగా మారిన యువతను మాదక ద్రవ్య వ్యసనం నుండి విముక్తి కలిగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమములో ముందుగా మత్తుకు బానిసలైన భాధితులతో పాటు వారి కుటుంబ సభ్యుల యం.జి.యంకు చెందిన సైక్రియాట్రిస్ట్ డాక్టర్ చే స్క్రీనింగ్ నిర్వహించి అసలు సమస్య ఏమిటి, వీరు ఏవిధంగా మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. వీరికి ఎలాంటి చికిత్స అవసమనే అంశాలను పరిశీలించడంతో పాటు, బాధితుల ఆరోగ్య స్థితిగతులను దృష్టిలో వుంచుకోని వారిని హస్పటల్ వుంచుకోని వారికి దీర్ఘకాలిక చికిత్స అందజేయబడుతుంది. ఈ చికిత్స సమయంలో బాధిత వ్యక్తిగత వివరాలను పూర్తిగా గోప్యంగా వుంచబడుతుందని, ఆదే విధంగా చికిత్స అవసరం లేని వారికోసం బన్ను అసోసియేషన్ సేవా సమితి స్వచ్చంద సంస్థ తరుపున నిర్వహిస్తున్న మాదక ద్రవ్య వ్యసన విముక్తి కేంద్రం ద్వారా బాధితులకు సుదీర్ఘకాల చికిత్స అందజేయబడుతుంది. ఈ సమయంలో బాధితులకు వ్యక్తిగత కౌన్సిలింగ్తో పాటు వారి వ్యక్తిగత యోగక్షేమాలపై కౌన్సిలింగ్ నిర్వహించబడుతుంది. ఆలాగే వారిలో మత్తుపై వున్న వ్యా మోహాన్ని దృష్టి మరల్చడానికి వారిలో ఆరోగ్యకరమైన వ్యాపకాలపై దృష్టి సారించే విధంగా తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని. ఈ చికిత్స పూర్తిగా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఏవరైన మత్తుకు బానిసలైనవారు ఈ కేంద్రం ద్వారా చికిత్స పొందాలనుకున్నావారు 9491860824 నంబర్ ఫోన్ తమ వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుందని తెలిపారు. చివరగా గంజాయి రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్ గ ఉండాలనీ సీపీ గారి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా గత ఏడాది నుండి ఇప్పటి వరకు 150పైగా గంజాయి కేసులను ( రెండు టన్నుల ఒక క్వింటన్ యాభై మూడు కిలోల గంజాయిని సీజ్ మరియు 12 మంది పై పీడి ఆక్ట్ చట్టాన్ని పెట్టడం జరిగినది) నమోదు చేయబడ్డాయి. అదే విధంగా ప్రజల్లో ఈ మత్త పదార్థాలపై అవగాహన కల్పించడమ్ జరుగుతుంది
ఈ కార్యక్రమములో టాస్క్ఫోర్స్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ జి, సంతోష్, ఎస్ ఐ లు లవన్ కుమార్, ప్రేమనందం మరియు హన్మకొండ, కేయిసీ, మిల్స్కాలనీ, ధర్మసాగర ఎస్ ఐ లు, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పాటు బాధితులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.