కలకోవ గ్రామంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న మత్స్య శాఖ సభ్యుల తొలగింపు, ఆర్థిక లావాదేవీలు విచారణకు మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మునగాల రైతువేదికలో విచారణ జరిగింది. వారు ఇరువర్గాల వాదనలు క్షున్నంగా పరిశీలించడం జరిగింది. కొందరిని గతంలో సభ్యత్వం నుంచి తొలగించారని, వాటికి సంబంధించిన డబ్బులను సబ్యులకు పంచకుండా ఒక్కరో ఇద్దరో వాడుకుంటున్నారని సంఘం సభ్యులు అధికారులకు తెలియజేసారు. ఇరువర్గాల వాదనలను నమోదుచేసి పై అధికారులకు నివేదిక ఇచ్చి చర్యలు తీసుకుంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, సంఘం సభ్యులు పాల్గొన్నారు.