ఐద్వా ఆధ్వర్యంలో నల్లగొండలో రాస్తారోకో

     దోషులను కఠినంగా శిక్షించాలి ప్రభావతి ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డిమాండ్

    పట్టపగలే మద్యం మత్తులో ధనలక్ష్మి (54) అనే వైశ్య మహిళను అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసిన బక్కతొట్ల లింగయ్య మరియు కుమ్మరి పుల్లయ్య అనే నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామంలో ఈరోజు పట్టపగలే ధనలక్ష్మి అనే మహిళను అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది.మృతురాలికి ఇద్దరు కూతుర్లు భర్త ఉన్నారు.వృత్తి కిరాణా షాపు నడుపుతుంటారు.అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో సైకోలుగా రోడ్లపై తిరుగుతుంటారు.ఇంటి చుట్టుపక్కల ఎవరూ లేరని అదునుగా భావించి మహిళను వివస్త్రను చేసి అత్యాచారం చేసి తల పగలగొట్టి హత్య చేయడం జరిగింది.స్థానిక సుభాష్ విగ్రహం వద్ద నల్లగొండలో ఐద్వా ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ప్రభావతి మాట్లాడుతూ బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వెలిశాయని మద్యం మత్తులో రోజుకో ఘటన జరుగుతుందని అన్నారు.బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.హత్య గావించబడిన మహిళకు పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , హత్యల ఘటనలపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి 30 రోజులలో నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. పసిపాపల నుంచి వృద్ధుల వరకు ఈ అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న ఘటనలను నియంత్రించడంలో  ఘోరంగా విఫలం చెందిందని అన్నారు.
     ఈ కార్యక్రమంలో ఐద్వా పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమారాణి మరియు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు బండ శ్రీశైలం సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండీ సలీమ్ జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య పుచ్చకాయల నర్సిరెడ్డి నల్లగొండ మండల కార్యదర్శి నలపరాజు సైదులు పట్టణం కమీటి సభ్యురాలు దండంపల్లి సరోజ మండల నాయకులు జిల్లా అంజయ్య దొండ కృష్ణ రెడ్డి కొండా వెంకన్న పోలే సత్యనారాయణ బొల్లు రవీందర్ ఊట్కూరు మధుసూదన్రెడ్డి శ్రీనివాసాచారి యువజన సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నరేష్ నవీన్ యువజన సంఘం నల్లగొండ మండల కార్యదర్శి కండే యాదగిరి జానయ్య గంగుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు 

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.