మద్యం మత్తులో రెండు టూవీలర్లు ఢీ

మద్యం మత్తుతో డ్రైవింగ్ రెండు టూవీలర్లు ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు జనగామ జిల్లా జాఫర్ ఘడ్ :-మండలశివారులో వర్ధన్నపేట రహదారిలో రెండు టూవీలర్లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళ్ళితే జాఫర్ ఘడ్ వడ్డెగూడం గ్రామానికి చెందిన కుక్కల కుమారస్వామి, కుక్కల విజయ్ లు జాఫర్ ఘడ్ నుండి వర్ధన్నపేట వైపు మద్యం మత్తుతో డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న దివిటిపల్లి గ్రామానికి చెందిన కూనూరు రాజు జాఫర్ ఘడ్ వైపు వెళ్ళుతున్న బైక్ ను ఢీ కొట్టడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి.స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జాఫర్ ఘడ్ ఎం.పి.పి సుదర్శన్, నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జరి రాజు మరియు మండల నాయకులు మండలంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రమాద స్థలంకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు.108 అంబులెన్స్ రావడం ఆలస్యం అయినందున వెంటనే రెండు ఆటోలలో ఎక్కించి మెరుగైన వైద్యం కోసం వరంగల్ కు పంపించారు.స్థానిక పోలీస్ కానిస్టేబుల్ వచ్చి వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.