మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మునగాల మండల ఎంఈఓ సలీమ్ షరీఫ్ కు సమస్యలతో కూడుకున్న వినతి పత్రము ఇచ్చిన సిఐటియు సభ్యులు. బచ్చల కూర స్వరాజ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు కార్మికులకు కనీస వేతనం 21 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. అలాగే సబ్సిడీ గ్యాస్ ఇవ్వాలని, ప్రభుత్వాన్ని కోరినారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు బచ్చలకూర రాంబాబు, మధ్యాహ్న భోజన కార్మికులు బి మంగమ్మ, కె అమృతమ్మ, బి సరోజన, బి పాండు సిఐటియు మండల కమిటీ సభ్యులు మామిడి గోపయ్య పాల్గొన్నారు.