పిల్లల ప్రాణాలతో చెలగాటమా
కనీస మౌలిక వసతులు లేవు
ఈ రోజు మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల ను సందర్శించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న కల్తీ ఆహారం తిని 36 విద్యార్థులు అస్వస్థతకు గురికావడం భాదకారం అని ప్రభుత్వం,ప్రభుత్వ అధికారులు పిల్లల ఆరోగ్యాల పట్ల కానీ వారికి కల్పించాల్సిన మౌలిక వసతుల పై ప్రత్యేక దృష్టి సారించాలని పప్పులో వాన పాములు జర్రులు తో కూడిన భోజనం హాస్టల్ లో పెడుతున్న పరిస్థితి మినిరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని మెను ప్రకారం కాకుండా నీళ్ళ చారు కుళ్ళిన కూరగాయల తో కూరలు వండి పెట్టడం మూలాన మొన్న గూడూరు నిన్న మహబూబాబాద్ ఇలా రోజుకో సంఘటన చూస్తున్నాం అని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కొత్త గూడ ఎంపీపీ విజయ రూపు సింగ్ కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
