మను ధర్మశాస్త్ర ప్రతుల దగ్ధం కార్యక్రమం

డిసెంబర్ 25వ తేదీ న కె.వి.పీ.యస్ ఆధ్వర్యంలో జరిపే మను ధర్మశాస్త్ర ప్రతుల దగ్ధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున కోరారు. చిట్యాల లో బుధవారం నాడు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మను ధర్మశాస్త్రం ప్రభావం వల్ల సమాజం లో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ బలోపేతం అవుతుందని డా బీ ఆర్ అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 న మను ధర్మం శాస్త్ర గ్రంథాలను దగ్ధం చేశారని అన్నారు. దళితులకు, మహిళలకు చదువు వద్దని చెప్పే ఈ బ్రాహ్మణుల చెడు వ్రాతలతో ఉన్న మను ధర్మశాస్త్ర ప్రతులను దగ్ధం చేయాలని ఆనాటి నుండి నేటి వరకు పాలకులి విధానాలలో ఎలాంటి మార్పు లేనందున నిరసన గా దగ్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఆరెస్సెస్ బావ జాలంతో పనిచేసే మెడీ ,కేసీఆర్ సర్కార్ లు యునివర్సిటీలో పేద విద్యార్దులకు రిజర్వేషన్ హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తూ అలజడి సృష్టించే వారి పై కఠినంగా వ్యవహరించటం లేదని విమర్శించారు. గో సంరక్షణ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేస్తూ దళిత, ముస్లిం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ తినే తిండి, కట్టే దుస్తుల పై ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జిట్ట నగేష్, వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, కె.వి.పి.యస్. చిట్యాల పట్టణ అధ్యక్షులు బొడ్డు బాబురావు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.