హజరైన ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు
*స్వచ్ఛభారత్ పితామహుడు సంత్ గాడ్గే బాబా చరిత్రలో పరిశుభ్రతే దైవమని నిర్వహించిన తొలి సంఘసంస్కర్త ,చీపురుతో వీధుల్ని ,భజన కీర్తనలతో మస్తిష్కాలనీ శుభ్రం చేసిన వాగ్గేయకారుడు, గుడితో పాటు బడిలో ఆధ్యాత్మికత వెదికినాడు , మహారాష్ట్రలో 100 పైగా విద్యాలయాలు, దేవాలయాలు,అనాద ఆశ్రమాలు కట్టించాడు, అలాంటి గొప్ప సంఘ సంస్కర్త ఆయన యొక్క 146వ జన్మదిన వేడుకలను ఈరోజు మెదక్ జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యుడు బక్కవారి గణేష్ గారి ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో గాడ్గే బాబా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సందర్భంగా హజరైన రాష్ట్ర రజక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమకాలీనుడు, సామాజిక న్యాయం, సమానత్వం, సామాజిక సమరసతా విధానం కోసం పరితపించిన సాంఘిక విప్లవకారుడు, సమస్త ఛాందసాలనూ,అంధ విశ్వాసాలను హేతువుతో ఖండించిన సాధువు .సమాజంలో పాతుకుపోయిన ,మూఢచారాలను నిర్మూలించాలని,ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణ వాది,
ఆ జన్మాంతం ఈ సమాజానికి అర్పించిన సర్వసంగ పరిత్యాగి మన సంత్ గాడ్గే బాబా గారు,ఇలా తన జీవిత చరిత్ర నేటి రేపటి యువతరానికి స్ఫూర్తి దాయకం ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మొదటిసారిగా సంత్ గాడ్గే బాబా గారి విగ్రహాన్ని వచ్చే నెల 13వ తేదీన మన మెదక్ జిల్లా కేంద్రంలో జరగబోయే భారీ బహిరంగ సభ రోజున ఆవిష్కరించబోతున్నామని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వర్సపల్లి నర్సింహులు తెలిపారు.కార్యక్రమంలో రజక మీడియా సెక్రటరీ నాగరాజు, పట్టణ రజక సంఘ నాయకులు ధర్మగల్ల మహేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
మన రజక సంఘం మెదక్ జిల్లా

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.