మన రాష్ట్రంలో కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టం రావాలి

జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి ధర్మ ప్రకాష్ మూఢ విశ్వాసాలతో కన్నకూతుర్లనే బలి ఇచ్చిన సంఘటనపై హనుమకొండ ఆదర్శకాలనీలోని అభినయంలో శనివారం నాడు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జనవిజ్ఞాన వేదిక విద్యా విభాగం కన్వీనర్ పరికిపండ్ల వేణు అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బి. ధర్మ ప్రకాష్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూఢనమ్మకాల నిర్మూలన చట్టం దేశమంతా అమలుపరిచినట్లయితే అమాయకంగా మోసపోయే వారికి రక్షణ లభిస్తుందన్నారు. మోసపు ప్రకటనలను ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్లోపై, వ్యక్తులపై ఆ పరికరాలు అమ్ముతున్న సంస్థలపైన నేరాలు నమోదు చేసి చర్యలు తీసుకుంటే సమాజంలో ఇలాంటి మూఢనమ్మకాలను నిర్మూలించవచ్చన్నారు. వేణు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి బాధ్యతాయుతమైన వృత్తిలో కొనసాగుతూ బాగా చదువుకున్న తమ కుమార్తెలను దేవుని పేరు మీద చంపేయడం, సత్యలోకం వస్తుందని, దేవుడు చనిపోయిన తమ బిడ్డలకు మళ్ళీ జన్మ ప్రసాదిస్తాడనే మూఢవశ్వాసాలతో వారు జీవించడం విచారించదగ్గ విషయం అన్నారు. వకులాబరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ రోజుల్లో టీ.వీ ఆన్ చేస్తే చాలు ఫలానా రంగురాయి ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది, మీ పేరులో ఒక అక్షరం లేక రెండు అక్షరాలు కలపడం గాని తీసివేయడంగాని చేస్తే మీ జీవితాలు బాగుపడతాయని మోసగించేవారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వీరిని అరికట్టేందుకు ప్రతి రాష్ట్రంలో కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణలో కూడా మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లో శాస్త్ర మిత్ర స్టడీ సర్కిల్ కోశాధికారి వేణుగోపాల్ , కల్చరల్ సెక్రటరీ కూన మొగిలి, బత్తిని స్వామి, మార్గం శ్రీనివాసులు, శ్రీను విద్యానంద్ ,తిప్పని రమేష్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.