దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో త్రిపుర బిజెపి ఎంపీ రేబాటి త్రిపుర గురువారం పర్యటించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఎంపీ రేబాటి త్రిపుర చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో కార్గిల్ స్థూపానికి నివాళులర్పించి జాతీయ రహదారి బైక్ ర్యాలీ కనకదుర్గ ఫంక్షన్ హాల్ సభాముఖంగా పార్టీ విషయాలు దిశానిర్దేశం చేశారు జులై ముడు తేదీన జరగబోయే బహిరంగ సభకు డోర్నకల్ నియోజకవర్గం నుండి పదివేల మంది తరలిరావాలని పిలుపునిచ్చారు అదేవిధంగా రాబోయే ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం రాష్ట్రం లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం జెండా ఎగురవేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు వివరించారు ఆయన వెంట బిజెపి నాయకులు లక్ష్మణ్, మండల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గ్రామ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు