మరిపెడ నిరవధిక సమ్మెలో వీఆర్ఎలు

రాష్ట్రంలో వీఆర్ఎల జేఏసీ పిలుపు మేరకు మరిపెడ మండల వీఆర్ఎల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన వీఆర్ఎల అందరికీ పెస్కేల్, అర్హులందరికీ ప్రమోషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మరిపెడ మండల జేఏసీ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా మరిపెడ మండల జేఏసీ చైర్మన్ ఎం వీరన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్వయంగా ప్రగతి భవన్ అసెంబ్లీ లో మూడు సార్లు వీఆర్ఎ లకు పేస్కెల్ ఇస్తామని ప్రకటించి రెండు సంవత్సరములు అయినప్పటికీ అమలు చేయక పోవడం దరదుష్టకరం అన్నారు. వీఆర్ఎ లు చాలి చాలని వేతనాలతో కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి వారి జీవితంలో వెలుగు నింపాలని కోరారు. ఈ సమావేశంలో వీఆర్ఎ లు వడ్లకొండ జ్యోతి, ఖదర్, కో కన్వీనర్ శ్రీనివాస్, రాజు, నాగమణి, దిలీప్, ఉప్పలయ్య, మరిపెడ గ్రామ రెవెన్యూ అధ్యక్షులు హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సుధాకర్, కోశాధికారి వినయ్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.