sfi news telugu news

సంఘీభావం మద్దతు పలికిన కెవిపిఎస్

  • పాఠ్యపుస్తకాలు స్కూలు యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్

మరిపెడ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని . ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర నాయకులు పెద్ద బోయిన వీరబాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ,ప్రైవేటు విద్యాసంస్థలను విజయవంతంగా బంద్ చేయడం జరిగింది. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తా అని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచిన కనీసం సరైన తరగతి గదులు లేవని ప్రస్తుత కాలానికి అనుకూలంగా మధ్యాహ్న భోజనం బిల్లులు పెంచకపోవడం వల్ల విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించడంలో విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు , కార్పొరేట్ విద్యను వ్యతిరేకించాల్సింది పోయి కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం సమముఖం కాదని వెంటనే కార్పొరేట్ విద్యా వ్యవస్థను వ్యతిరేకించాలని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమానికి కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య సంఘీభావం తెలియజేసి మద్దతు పలికారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పాఠ్యపుస్తకాలు, స్కూలు యూనిఫామ్ ఇయ్యకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనకు సామాజిక సంఘాల మద్దతుతో సామాజిక ఉద్యమంగా మారుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ మండల కన్వీనర్ పత్తిపాటి వినయ్, ఉమేష్, ప్రభాసు, నవీను ,వివేకు ,భీమేష్, సురేష్ ,ముఖేష్ ,సుప్రియ ,సుమాంజలి ,సునీత ,ప్రియాంక, పుష్ప, శ్రావణి ,యశ్వంత్, మహేష్ కుమారు ,సిద్దు, ఎస్ఎఫ్ఐ మంజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.