పిల్లలు చదువుతో పాటుగా క్రీడల్లోనూ జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆకాంక్షించారు. శనివారం ఆయన మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూర రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను పిల్లలు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ యువత నైపుణ్యాలను వెలికి తీసేందుకు తెరాస ప్రభుత్వం ఎన్నో వెసులుబాటు కల్పిస్తోందన్నారు. క్రీడల ఏర్పాటుకు దాతల సహకారం అభినందనీయం అన్నారు. కాగా బాలల ఆడుకునే అందుకు కు క్రీడా సామగ్రిని తెరాస జిల్లా నాయకులు కుడితి మహేందర్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, కౌన్సిలర్లు పానుగుతు సుజాత వెంకన్న, వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, స్రవంతి భద్రయ్య, ఉరుగొండ శ్రీనివాస్, హతిరం, శ్రీను, ఏడెల్లి పరశురాములు, బయ్య బిక్షం, కిషన్, కో ఆప్షన్ సభ్యులు షేక్ మక్సుద్, ఖైరున్ హుస్సేన్, తెరసా నాయకులు నారెడ్డి సుదర్శన్ రెడ్డి, ఎస్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు బాలాజీ, పట్టణ ప్రధాన కార్యదర్శి సుమంత్ రెడ్డి, మునిసిపల్ సిబ్బంది అన్సారీ, నాగరాజు, అశోక్ రెడ్డి, కెలోత్ శ్రీను, వీరన్న, తెరసా నాయకులు సురేష్, పిఈటి శంకర్, తదితరులు పాల్గొన్నారు.