మహబూబాబాద్ జిల్లా మరిపెడ సీతారాంపురం పాఠశాల యందు వాసవి క్లాత్ స్టోర్ యజమాని మేక వెంకటేశ్వర్లు, మేక నాగమణి కుమార్తె మేక రిశిక జన్మ దినం సందర్భంగా ఆమె మొదటి జీతం నుండి సీతారాంపురం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 10 వేల విలువగల నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిలు లతోపాటు పది కుర్చీలను మంగళవారం అందించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మాధురి తో పాటు ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వెంకటరమణ లు రిశిక ను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, రామ్మోహన్, విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శ్రీశైలం, ఇందిరా, ఫిరోజ్, నాగేష్ నాయక్, శౌరి, నిర్మల, మేరిశీల, ప్రసాద్, శంకర్, ప్రేమ్ సాగర్, హరి, మధుకర్, రాజకుమారి, వెంకన్న, సురేష్, సోఫియా, ఉమాదేవి, మంగీలాల్, ప్రభాకర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.