ఈ69న్యూస్ జఫర్ ఘడ్/మార్చి20
జఫర్ ఘడ్ మండలంలోని వివిధ గ్రామాలలో పార్టీల కతీతంగా కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి నివాళులు అర్పించారు.మండలం లోని తమ్మడపల్లి జి గ్రామంలో మల్లు స్వరాజ్యం గారి మరణవార్త విని సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, వివిధ పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి గురైయ్యారు.వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వారి యొక్క ముఖ్య పాత్రను గుర్తు చేసుకుంటూ భవిష్యత్ తరాలకు గొప్ప మార్గదర్శిగా నిలిచిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారి ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం పార్టీ మరియు ఐద్వా మహిళ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తూ వారి ఫోటోకు పూలమాలవేసి నివాళులు అర్పించారు.జోహార్లు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం గారికి విప్లవ జోహార్లు అంటూ నినదించారు.ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.
