మల్లు స్వరాజ్యం స్మృతి గీతాలు..." ఓ అరుణ తార" ఆడియో సిడిని ఆవిష్కరన

సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం సంస్మరణ సభ ఈనెల 29న సూర్యాపేట లోని గాంధీ పార్కు లో జరుగుతున్న సందర్భంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో రూపొందించిన ఆడియో సిడి ని రూపొందించడం అభినందనీయమని ఈ పాటలు ప్రజలను నోళ్లలో ఎల్లకాలం ఉంటాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్ లో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఓ అరుణ తార ఆడియో సిడీని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి ,సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ ప్రసిద్ధి గాంచిదని ఆ పోరాటంలో 13 ఏళ్ల చిరుప్రాయంలో తుపాకీ చేతబట్టిన వీరనారి మల్లు స్వరాజ్యం అన్నారు. నాడు తెలంగాణ ప్రాంతంలో జరిగిన భూమికోసం ,భుక్తి కోసం ,పేద ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటంలో పాల్గొని దొరలను, భూస్వాములను, జాగీర్దారుల ను తరిమికొట్టి పేద ప్రజలకు అండగా మల్లు స్వరాజ్యం నిలిచారని అన్నారు. నాటి పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య, భీమిరెడ్డి నరసింహారెడ్డి ,బొమ్మగాని ధర్మభిక్షం ,మల్లు వెంకటనర్సింహారెడ్డి లాంటి గొప్ప పోరాటయోధుల తో కలిసి ఆ పోరాటంలో ఆమె పని చేసిందన్నారు. తుంగతుర్తి ప్రాంతం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పాలకులను నిలదీశారని గుర్తు చేశారు. మహిళల సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించారని అన్నారు. దేశంలో ఎక్కడ మహిళ లకు అన్యాయం జరిగిన అక్కడ మల్లు స్వరాజ్యం ఉండేవారని అన్నారు. కార్యకర్తలకు ఎప్పుడు కష్టం వచ్చినా అక్కడి వాలి ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పట్టువదలని విక్రమార్కుడు వలె పని చేశారని అన్నారు. సారా వ్యతిరేక ఉద్యమాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించి పాలకుల కళ్ళు తెరిపించే విధంగా ఉద్యమించా రని అన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.