మళ్లీ పెరిగిన గృహ వినియోగ వంటగ్యాస్ ధర.. సిలిండర్‌పై రూ. 50 పెంపు

5 కేజీల సిలిండర్‌పై రూ. 18 పెంపు
19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 8.50 తగ్గింపు
పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి
వంటగ్యాస్ ధరలు మరోమారు పెరిగాయి. 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరతో కలుపుకుని ఢిల్లీలో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 1053కి చేరుకుంది. అలాగే, 5 కేజీల సిలిండర్ ధరపై రూ. 18 పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 8.50 తగ్గించింది.

కాగా, జులై 1న ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ. 198 తగ్గగా, జూన్‌ 1న ఇదే సిలిండర్‌ ధర రూ.135 తగ్గింది. ఏప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌ ధర రూ.250 పెరగడంతో దాని ధర రూ. 2,253కి పెరిగింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.