ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ
కొత్త గూడ, గంగారాం, మండలాల లో ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా పాత రోడ్లు దెబ్బతిన్నాయని మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయాలి ఆగిపోయిన కొత్త రోడ్ల పనులు పూర్తి చేయాలని ముఖ్యంగా గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్ళు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మంచి నీటి సమస్య లేకుండా తమరు చొరువ తీసుకోవాలని
అదే విధంగా భారీ వర్షాల కారణంగా కొత్త గూడ గంగారాం మండలాల పలు గ్రామాలలో ఇండ్లు పూర్తి స్థాయిలో నేలమట్టం కావడం జరిగిందని
ముంపుకు గురైన బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పిన మాట ప్రకారం కుటుంబానికి 10వేల ఆర్థిక సాయం తో పాటు డబుల్ బెడ్ రూం లు మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవాలినీ వెనకబడిన కొత్త గూడ గంగారాం మండలాల అభివృద్ధికి తమరు కృషి చేయాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకు పోయిన సీతక్క

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.