మహిళలు లేనిదే సమాజం లేదు

ఆడపిల్లలనుకాపాడుకోవడమేమన ముందున్న కర్తవ్యం
—– పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా కార్యదర్శి
<<<<<<<>>>>>>>
మహిళలు లేనిదే సమాజము లేదు నేడు ఆడపిల్లను కాపాడుకోవడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యం అని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు.ఈరోజు నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సభకు గ్రామ సర్పంచ్ సురిగి మణెమ్మ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభావతి మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు అనేక పనుల్లో మునిగి తేలుతుందని అన్నారు. మరియు డాక్టర్ గా యాక్టర్ గా కలెక్టర్ గా ఎన్నో రకాల పనులు చేస్తున్న మహిళలకు నేడు సమాజంలో రక్షణ భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఆడపిల్లల నిష్పత్తి ఘోరంగా తగ్గిపోతుందని ప్రతి వెయ్యి మందికి తొమ్మిది వంద డెబ్బై మంది మాత్రమే ఆడ పిల్లలు ఉన్నారని అన్నారు.ఈ యొక్క అంతరాల వలన అనేక అఘాయిత్యాలు జరిగే ప్రమాదం ఉందని ఆడపిల్లలను కాపాడుకోవాలని భ్రూణహత్యలు అరికట్టాలని అన్నారు.
నేడు దేశంలో హత్రాస్ ఘటన అంగన్వాడీ టీచర్ హత్య చాలా ఘోరం అయిందని అన్నారు.దీనికి కారకులు ఎవరని ప్రశ్నించారు.పాలక ప్రభుత్వాలు మద్యం గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్న అరికట్టడంలో ఘోరంగా విఫలం చెందాయని అన్నారు.మరొక పక్క అశ్లీల చిత్రాలు యూట్యూబ్ ఛానెల్స్ విచ్చల విడి గా వస్తున్న బూతు సినిమాలు సీరియల్స్ ను ఖచ్చితంగా నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.యువతి యువకుల తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అనునిత్యం కౌన్సెలింగ్ చేస్తూ సక్రమ మార్గంలో నడిపించాలని అన్నారు.
ఈ ముగ్గుల పోటీలలో ప్రథమ బహుమతి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు నూటయాభైమందికి కన్సొలేషన్ ప్రైజులు ఇచ్చినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు పెద్ది ఇందిరమ్మ ఉపసర్పంచు కొడదల కళమ్మ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ఉప్పుల జానీ జంజరాల సుందర్ ఉప్పుల గోపాలు జంజిరాల ఇస్తారి పాలడుగు భిక్షం తంతెనపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.