మహిళల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి


దుద్దుకూరి కృష్ణ, గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు** 💐💐💐
నందిగామ
వైయస్సార్ జీవక్రాంతి 11 ద్వారా మహిళా అక్క చెల్లి మన జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుద్దుకూరి కృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నందిగామ లో విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో జీవో క్రాంతి పథకం ద్వారా తొలి విడతగా 8658 యూనిట్లు మంజూరు కాగా,నందిగామ నియోజకవర్గానికి 1528 యూనిట్లు మంజూరు అయ్యాయని వివరించారు.ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్వచనానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని కృషి చేస్తున్నారని తెలిపారు.
భూమి లేని నిరుపేదలకు గొర్రెలు మేకలు అందజేయడం ద్వారా వారు జీవనోపాధి మెరుగుపరిచేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి గొర్రెల పెంపకం దారులసంఘాలు మరియుఫెడరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

One thought on “మహిళల అభివృద్ధికి సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి”

Leave a Reply

Your email address will not be published.