మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మహిళా లోకానికి గర్వకారణం అని ప్రశంసించిన-డా.సామల శశిధర్ రెడ్డి

సరోజినీ నాయుడు జన్మదినం రోజున జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం మహిళా లోకానికి గర్వకారణం అని ప్రశంసించిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు తెలంగాణ ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా.సామల శశిధర్ రెడ్డి భారత స్వాతంత్ర్య సమర యోధురాలు భారతదేశ తొలి గవర్నర్ మరియు భారతదేశ గానకోకిల గా పేరుపొందిన గొప్ప మహనీయురాలు శ్రీమతి సరోజినీ నాయుడు జన్మదినం అయిన ఈ రోజును జాతీయ మహిళా దినోత్సవం గా జరుపుకోవడం మహిళా లోకానికి గర్వకారణంగా భావిస్తున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో నాడు ఎనలేని సేవలు అందించిన ఘనత సరోజినీ నాయుడు గారిదని ఎంతో ధైర్య సాహసం చేసి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మహిళల శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయురాలు సరోజినీ నాయుడు . అంతేకాకుండా భారత దేశానికి తొలి మహిళా గవర్నర్ గా పనిచేసి భారత గాన కోకిలగా పిలువబడిన ఘనత ఆమెది అని కనుక మహిళలంతా మీ శక్తి పట్ల గొప్ప నమ్మకంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని ఆడపిల్లల రక్షణ లో మరియు మహిళల అభివృద్ధి లో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకున్నారు మహిళా లోకం తయారవ్వాలని మహిళా శక్తిని ప్రపంచంలోనే గొప్ప శక్తిగా అందరూ చెప్పుకునే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలందరికీ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ టీచింగ్ నాన్-టీచింగ్ ఫోరం మరియు ఫోరం ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా రాష్ట్రంలోని మహిళా మణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు శశిధర్ రెడ్డి పేర్కొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.