మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసిన-జంగా

జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాజీపేట రైల్వేస్టేషన్ లో కేక్ కట్ చేసి మళ్లీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా కాజీపేటలోని కమ్యూనిటీ హాలులో మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి మహిళాలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…

భారత తొలి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ లాంటి ఎందరో గొప్ప మహిళలు పుట్టిన దేశం మనది.

ఒకప్పుడు స్త్రీ కేవలం వంట గదికి మాత్రమే పరిమితమై ఉండే రోజుల నుండి ఇప్పుడు వాయుసేన లో ఫైటర్ పైలెట్ నడిపే స్థాయికి వచ్చారు.

ఇలా మహిళలు వారు ఉన్న ప్రాంతంలోనే ఎన్నో గొప్ప విజయాలు సాధిస్తున్నారు.

మీరు కూడా మీలోని ప్రతిభ ఆధారంగా అయా రంగాలలో మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.