warangal news local news telugu news

తేదీ:02-07-2022.

వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ, కార్యదర్శి జీ.వీ. మహేష్ నాధ్ అధ్యక్షతన జిల్లా న్యాయ సేవా సదన్ బిల్డింగ్, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం లో పేదరిక నిర్మూలన అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు వరంగల్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ కె. రాధా దేవి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ” మహిళా సాధికారత ద్వారానే పేదరిక నిర్మూలన జరుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు చిన్నచిన్న సంఘాలలో చేరి పొదుపు చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. స్వామి వివేకానంద గారు తెలిపినట్లు ఒక ఇంట్లో మహిళ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబంలో అందరూ విద్యావంతులైనట్లు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినట్లయితే కుటుంబం కూడా ఆర్థికంగా ముందుంటుందని చెప్పవచ్చు అని తెలిపారు. మహిళలు చిన్న తరహా పరిశ్రమలలో తమ ప్రతిభను కనబరిచి, బ్యాంకుల ద్వారా రుణాలు పొంది, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ రకంగా తెలియజేశారు. మహిళలు అన్ని రంగాలలో ముందుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేయాలి అని తెలిపారు. ఎటువంటి సందేహాలకైనను సలహాలకైనను న్యాయ సేవాధికార సంస్థలను ఆశ్రయించి న్యాయ సలహాలు సూచనలను పొందగలరని తెలిపారు.
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వి. మహేష్ నాధ్ న్యాయ సేవాధికార సంస్థ విధులను, లోక్ అదాలత్, ఉచిత న్యాయ సహాయం గురించి వివరంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా డి.ఆర్.డి.ఓ. సంపత్ రావు అడిషనల్ డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్ మరియు అడిషనల్ డి.ఆర్.డి.ఓ. శ్రీనివాస్, డి.ఆర్.డి.ఏ., డి.పి.ఎం. అండ్ ఏ.పీ.ఎం.ఎస్ మరియు మండల సమాఖ్య ఓ.బి. మెంబర్స్, సి.సి.లు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.