మహిళ ఆరోగ్యంతోనే ఆరోగ్యవంతమైన సమాజం-పెరుమాండ్ల అన్నపూర్ణ

మహిళలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమ సమాజం సాధ్యమవుతుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సూర్యాపేట నిర్మాణం చేయడం సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ గారు తెలియజేశారు. పట్టణంలోని మెప్మా రిసోర్స్ పర్సన్లు మరియు అధికారులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
సూర్యాపేట పట్టణంలో మాన్యులు మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తరుణంలో సంక్షేమ కార్యక్రమాలు మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.ఐక్యరాజ్య సమితి లో ప్రధాన విభాగమైన యూనిసెఫ్ వారి సహకారంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ – మెప్మా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు పట్టణాలలో టెలి స్వాభిమానం అనే పైలెట్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని అని తెలిపారు. ఈ మూడు పట్టణాల్లో సూర్యాపేట ను ఎంపిక చేయడం హర్షణీయం అని తెలిపారు. ఆరోగ్యవంతమైన పట్టణంగా మారడానికి పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ట్రీ పార్కులను ఏర్పాటు చేయడం, తెలంగాణకు హరితహారం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటడం, మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ, విశాలమైన రోడ్ల నిర్మాణం, రోడ్ జంక్షన్ ల అభివృద్ధి మొదలగు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో మెప్మా, షీ టీమ్, భరోసా సెంటర్, పోలీసు శాఖ, శిశు సంక్షేమ శాఖ మరియు ఆరోగ్య శాఖ సమన్వయంతో టేలి మహిళా మిత్ర కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తల్లి పిల్లల సంరక్షణ ప్రధాన పాత్ర గా మెప్మా రిసోర్స్ పర్సన్లు పనిచేయవలసిన అవసరం ఉందని తెలియజేశారు. ప్రతి వార్డు లో మెప్మా రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి పట్టణ మరియు మహిళా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని తెలియజేశారు.
ఇందులో ప్రధానంగా గర్భవతులు, బాలింతలు, కిశోర బాలికలు, నవదంపతులు, రెండు సంవత్సరాల లోపు పిల్లలు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు మొదలగు వారికి టెలిఫోన్ ద్వారా ఆరోగ్య సలహాలు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇట్టి కార్యక్రమంలో యూనిసెఫ్ ప్రతినిధి గౌరీ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ నాయక్, షీ టీం ఇంచార్జి ఏఎస్ఐ పాండు నాయక్, షీ టీం అధికారి జ్యోతి భరోసా సెంటర్ ఇంచార్జి రజిత, సఖి సెంటర్ ఇంచార్జి శైలజ, శిశు సంక్షేమ శాఖ అధికారి రూప, పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు కవిత, మెప్మా సిబ్బంది రేణుక, శ్వేత, రోజా, సువర్ణ, ఉమా, పాపమ్మ, లక్ష్మణ్, ఆర్.పిలు మరియు సమాఖ్య అధ్యక్షురాళ్ళు హాజరయ్యారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.