మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ ఏ.సి.రెడ్డి నరసింహారెడ్డి 31వ వర్ధంతి సభను జయప్రదం చేయండి

జనగామ పట్టణ కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుండి పత్రిక ప్రచురణార్ధం మాట్లాడుతూ కామ్రేడ్ ఏ.సి.రెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడుగాను, జనగామ నియోజకవర్గం మాజీ శాసనసభ్యునిగా భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచారి వెట్టిచాకిరి విముక్తి కోసం, కులవివక్షతకు వ్యతిరేకంగా, పేదప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో నాడు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఆలేరులో ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంగా నైజాం పోలీసులు పాశవికంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు అమరులైనారని తెలిపారు. ఈ ప్రదర్శనను అగ్రభాగాన ఉండి నడిపించినది ఏ.సి.రెడ్డి నరసింహారెడ్డిని తెలిపారు. ఇలాంటి మహనీయుని వర్ధంతి సభ జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ వద్ద గల కామాక్షి ఫంక్షన్ హాల్ నందు నిర్వహిస్తామని ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు అదేవిధంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. అబ్బాస్ గారు పార్టీ సీనియర్ నయకులు గంగసాని రఘుపాల్ గారలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ వర్ధంతి సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.